ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా నెట్టింట పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా నమోదైన కేసులను ఏపీ పోలీసులు తవ్వి తీస్తున్నారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు వైసీపీ కీలక నేతలు,కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
తాజాగా సోమవారం వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. గతంలో ఆయన తీసిన వ్యూహం సినిమా టైంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణిని కించపరిచేలా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో మద్దిపాడు పీఎస్లో ఆయనపై ఫిర్యాదులు అందాయి.దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.