ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. వ్యవసాయరంగానికి రూ.48,340 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి సాధించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని చెప్పిన ఆయన ..గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలను ఎంపిక చేశామన్నారు. కూటమి ప్రభుత్వం 78 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ, రూ.120 కోట్ల విత్తన రాయితీ బకాయిలను మాఫీ చేసిందన్నారు.
ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం రూ.6.300 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టులు రూ.11,314 కోట్లు, పోలవరం నిర్మాణం రూ.6,705 కోట్లు, భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ.20వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు.