మత్స్యకారులకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం

-

మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేపలవేట నిషేధకాలంలో వారికి అందించే ఆర్థిక సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులకు రూ.20 వేలు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ సముద్రంలో చేపట వేటను ఏపీ సర్కార్ నిషేధించింది. ఆ టైంలో మత్స్య సంపద పునరుత్పత్తి జరుగుతుంది. అందుకే ఆ సమయంలో ఈ నిషేధం కొనసాగుతుంది. మత్య్సకారులను జీవనోపాధి ఉండదు. అందుకే 1996లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మత్య్సకారులకు ఆర్థిక సాయంగా రూ.2వేలు అందించింది. కాలక్రమేణా తదుపరి ప్రభుత్వాలు ఈ భృతిని పెంచుకుంటూ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news