గుడ్ న్యూస్ : తెలంగాణా – ఏపీ మధ్య కుదిరిన ఒప్పందం.. లెక్కలివే !

-

తెలుగు ప్రజలకి గుడ్ న్యూస్, చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. కిలోమీటర్ల చొప్పున బస్సులు నడపాలని ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. తెలంగాణ రవాణా శాఖా మంత్రి పువ్వాడ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. తెలంగాణలో 1,60,999 కిలోమీటర్ల మేర ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తిరగనుండగా, ఏపీలో 1,61,258 కిలో మీటర్ల మేర బస్సులు తిప్పనుంది తెలంగాణ ఆర్టీసీ.

అలానే ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులు తిప్పనుండగా తెలంగాణలో 638 బస్సులు తిప్పనుంది. ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ రూట్‌లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిప్పనుండగా అదే రూట్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ 192 బస్సులు తిప్పనుంది. గుంటూరు, హైదరాబాద్ వయా వాడపల్లి రూట్‌లో టీఎస్‌ఆర్టీసీ 57 బస్సులు తిప్పనుండగా ఏపీ 88 బస్సులు తిప్పనుంది. మాచర్ల సెక్టార్‌లో టీఎస్‌ఆర్టీసీ 66 బస్సులు తిప్పనుండగా అదే రూట్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ 61 బస్సులు తిప్పనుంది. మిగతా రూట్ లలో కూడా ఏపీ కంటే తెలంగాణానే బస్సులు ఎక్కువ తిప్పనుంది. ఇక హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో టీఎస్ ఆర్టీసీ 62 బస్సులు తిప్పనుండగా శ్రీశైలం హైదరాబాద్ మార్గంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిపివేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version