అమరావతి : పదో తరగతి ఫలితాలపై ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రేపు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రేపు సాయంత్రం 5 గంటలకు పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించినున్నారు. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
ఈ నేపథ్యంలోనే పరీక్షల ఫలితాల కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే…ఆ హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించింది ఏపీ విద్యాశాఖ. అలాగే… మార్కుల మెమోలను www.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఏపీ విద్యా శాఖ. కాగా.. కరోనా కారణంగా పదో తరగతి మరియు ఇంటర్ పరీక్షలను ఆంధ్ర ప్రదేశ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది సర్కార్. ఈ పరీక్షల్లో అందరినీ పాస్ చేస్తున్నట్లు పేర్కొంది.