ఏపీ టెట్ ఫలితాలు ట్విట్టర్ లో విడుదల

-

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎక్స్ లో టెట్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేశ్.  అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించారు. తాజాగా ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. వాస్తవానికి ఈ నెల 2న ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా తుది కీ వెల్లడిలో ఆలస్యం కారణంగా ఇవాళ విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించినట్టు తెలిపారు. ఫలితాలను (https://cse.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చన్నారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. టెట్ లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version