తెలంగాణపై కేసీఆర్ మోపిన భారం రోజుకు 60 కోట్లు : కొండా సురేఖ

-

యావ‌త్ తెలంగాణ స‌మాజం మీద కేసీఆర్ మోపిన భారం చూస్తే ఎవ‌రైనా బావురుమనాల్సిందే అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గంటకు సుమారుగా రెండున్నర కోట్లు… రోజుకు రూ.60 కోట్లు… ఇది ఏదో పేరు మోసిన కంపెనీ ఆదాయమో, రాబడో కాదు.. కేసీఆర్‌,కేటీఆర్ కుటుంబ పాల‌న పుణ్య‌మా అని తెలంగాణ నెత్తి మీదున్న అప్పుల కుప్ప,వడ్డీ రూపంలో చెల్లిస్తున్న మొత్తం.. ఈ లెక్కన అసలుకు సంబంధించిన కిస్తీలకు కలుపుకుని రోజుకు అక్షరాలా రూ.200 కోట్లు,నెలకు దాదాపు రూ.ఆరు వేల కోట్లకుపైగా కట్టాల్సి వ‌స్తున్న‌ది అని ఆమె వివరించారు.

బీఆర్‌ఎస్ హ‌యాంలో కేసీఆర్ స‌ర్కారు పదేండ్లలో చేసిన రూ.7.50 లక్షల కోట్ల అప్పులకు ఇంత పెద్ద మొత్తంలో కిస్తీలు,వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అక్టోబర్‌ వరకూ రూ.56,440 కోట్లను రీ పేమెంట్ల కోసం ఖర్చు చేశామంటే.. కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో చూడండి. ఇంక వాళ్ళే ఇత‌రుల‌పై ఆరోప‌ణ‌లు, అడ్డ‌గోలు వాద‌న‌లు చేయ‌డం చూస్తుంటే చాలా హాస్యాస్ప‌దంగా అనిపిస్తుంది.. దొంగే దొంగా,దొంగా అన్న‌ట్టు ఉంది అని కొండా సురేఖ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version