చంద్రబాబు అరెస్ట్ తో అయోమయంలో ఏపీ ఓటర్లు ?

-

ఆంధ్రప్రదేశ్ లో మరో ఆరు నెలల కాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి ప్రజల నుండి మద్దతు ఉందన్న మాట వాస్తవమే అయినా… చంద్రబాబు అరెస్ట్ జరిగిన నేపథ్యంలో సీన్ మొత్తం రివర్స్ అయ్యేలా ఉందంటూ రాజకీయ వర్గాలు అనుకుంటున్నారు. సిఐడి స్కిల్ స్కాం లో అవినీతి జరిగింది, ఇందుకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే అన్న కారణంతో అరెస్ట్ చేయడం జరిగింది. కానీ కొన్ని వర్గాలు జగన్ కావాలని రాజకీయ కక్షతో చేయించారని అంటున్నారు, కానీ దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికలకు ఏ విధంగా ఎఫెక్ట్ కానుంది ? ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? అన్న విషయాలు దోబూచులాడుతున్నాయి. ఇక రాజకీయ నాయకులకు భవిష్యత్తును నిర్దేశించే ఓటర్లు మనసులో ఇప్పుడు ఏముందన్నది చాలా కీలకంగా మారనుంది. చంద్రబాబు అరెస్ట్ తో చాలా మందిలో సానుభూతి వచ్చి ఉండే అవకాశం ఉంది..

అయితే అది ఏ స్థాయిలో అన్నది ఎన్నికలలో తెలుస్తుంది. ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని అయోమయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశయులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version