విద్య అనేది నేడు వ్యాపారంగా మారుతుందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. డబ్బు ఉంటేనే విద్య అనే విధంగా పరిస్తితి మారిపోయింది. మరి డబ్బులు లేని వారు ఎక్కడ చదువుకుంటారు అంటే..అంతా ప్రభుత్వ బడి అని సమాధానం ఇస్తారు. పైగా సర్కార్ బడి పల్లెల్లోని పిల్లలే చదువుకుంటారనే పరిస్తితి. అక్కడ అరకొర వసతులే ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగా ఇంగ్లీష్ మీడియం ఉండదు. ఇంగ్లీష్ లో మాట్లాడలేరు. అసలు ఇంగ్లీష్ కాదు కదా..కనీసం ప్రభుత్వ విద్యార్ధులు నిర్భయంగా అందరి ముందు మాట్లాడటం కూడా కష్టమే అనే పరిస్తితి.
అందుకే ఏదొక విధంగా కష్టపడి చదువులు పూర్తి చేసుకుని ఏదైనా ప్రైవేట్ జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే..ఇంగ్లీష్ లో మాట్లాడలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వ బడులు అంటే అందరికీ చిన్న చూపే. కానీ దాన్ని ఒకే ఒక్కరూ మార్చేశారు. తాను అధికారంలోకి రాగానే..విద్యా రంగానికి పెద్ద పీఠ వేశారు. ప్రైవేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించారు. కొంతమంది పెత్తందార్లు ఇంగ్లీష్ మీడియం అమలుకు అడ్డుపడిన..గ్రామాల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పిస్తున్నారు. అలాగే ఆర్ధిక స్తోమత లేని వారు పిల్లలని చదువు మాన్పించి పనులకు పంపకుండా అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు ఇస్తున్నారు.
పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఇంకా విద్య కానుక ద్వారా బ్యాగ్స్, షూస్, డ్రెస్,..ఇలా విద్యార్ధులకు కావల్సిన ప్రతి వసతి చూసుకుంటున్నారు. మరి ఇవన్నీ చేస్తున్నది ఎవరో అందరికీ తెలిసిందే. సిఎం జగన్ మోహన్ రెడ్డి..ప్రతి పేద విద్యార్ధి చదువుకుని గొప్పవారుగా ఎదగాలనే సంకల్పంతో ముందుకెళుతున్నారు.
ఇవన్నీ అందుతున్నప్పుడు విద్యార్ధులు ఎంత బాగా చదువుకుంటారో చెప్పాల్సిన పని లేదు. అలా గొప్పగా చదువుతూ పల్లెల నుంచి వచ్చిన ఓ పది మంది విద్యార్ధులు ఐక్యరాజ్యసమితిలో ఆంధ్రాలో బడులు ఎంత అద్భుతంగా ఉంటాయో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడి..పలు దేశాల అధినేతలు, ప్రతినిధులని ఆకట్టుకున్నారు. అటు ప్రపంచంలోనే అతి పెద్ద యూనివర్సిటీ కొలంబియా ప్రొఫెసర్లు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు..మన ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు.
సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు జరిగే ప్రత్యేక సదస్సుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా తీసుకెళ్లారు. వీరు అక్కడ పలు వేదికల మీద ప్రముఖుల సమక్షంలో చేసిన ప్రసంగాలు.. తమ ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న కృషిని అద్భుతంగా వివరిస్తూ..ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకోసం ఇస్తున్న ప్రాధాన్యం, దాన్ని అమలు చేస్తున్న తీరు, పిల్లలు సైతం దానికి తగిన విధంగా ఎదుగుతున్న తీరు అభినందనీయం అని ప్రఖ్యాత కొలంబియా వర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్ అన్నారు. తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో అద్భుతమైన పురోగతి సాధించడంపై కెనడా స్కూళ్లు, కాలేజీల సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు ముఖ్య అధికారి జూడీ ప్రశంసలు కురిపించగా, విద్యారంగంలో బాలికలు సాధించిన ప్రగతిని క్యాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షెరిల్ అభినందించారు.
ఇక న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పై జరిగిన సదస్సులో విద్యార్థులు మాట్లాడుతూ సమాజాభివృద్ధికి యువత ఎంత కీలకం అంటూ వారు చేసిన ప్రసంగం అక్కడి వారందరినీ ఆకట్టుకుంది. ఎక్కడో పల్లెటూర్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులు..అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితిలోనే అదిరిపోయే ప్రసంగం చేశారంటే..విద్యారంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి అని ముమ్మాటికి చెప్పుకోవాల్సిందే.