ఏపీలో రాగల మూడు రోజుల భారీ వర్షాలు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ సూచనలు చేసింది. నిన్న నైరుతి బంగాళాఖాతంపైనున్న వాయుగుండం, తీవ్ర వాయుగుండముగా మారి గడచిన 06 గంటల్లో సుమారు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. నేటి 5మార్చి 2022 ఉదయం 08 .30 గంటలకు 11 .4 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 82.6 డిగ్రీల తూర్పురేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది.

ఇది ట్రింకోమాలీ (శ్రీలంక)కు ఉత్తర ఈశాన్యముగా 340 కిలోమీటర్ల దూరంలో , నాగపపట్టణం (తమిళనాడు),కు తూర్పు ఈశాన్యముగా 300 కి.మీ.దూరంలో, పుదుచ్చేరి (తమిళనాడు)కు తూర్పు ఆగ్నేయంగా 300కి.మీ దూరంలో మరియు చెన్నై (తమిళనాడు)కు ఆగ్నేయంగా 300 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైయున్నది .

ఇది మార్చి 05 సాయంత్రమువరకు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మరియు తరువాత 36గంటల్లో పశ్చిమ-నైరుతి దిశగా తమిళనాడు తీరం వైపు కదులుతుంది. దీని ప్రభావంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version