ప్రభుత్వంతో మాట్లాడి అన్ని సమస్యలు కొలిక్కి వచ్చే విధంగా చూస్తాను : విద్యాసాగర్

-

APNGOS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన విద్యాసాగర్ కు జింఖానా గ్రౌండ్ లో ప్రమాణ స్వీకారం సభ ఏర్పాటు చేసారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా MLC అశోక్ బాబు, స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అలాగే రాష్ట్రవ్యాప్తంగా భారీగా హాజరైన ఉద్యోగ సంఘం నాయకులు వచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఈ సంఘం ఏర్పడిన దగ్గర నుంచి అనేక ఉద్యమాలు చేశాం. చంద్రబాబు దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు వరకు అనేక అంశాలపై పోరాటం చేశాం.

గతంలో మాకు డిమాండ్ లు ఉండేవి… కానీ రాను రాను డిమాండ్ లు పోయి మాకు రావాల్సినవి ఇస్తే చాలు అనే పరిస్థితికి వచ్చాము. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఉద్యోగులు లోన్స్ కోసం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పోయిన 5 ఏళ్లలో ఏ ఉద్యోగిని కదిలించిన ఒకటో తేదీన జీతాలు వచ్చేలా చూడండి అని అడిగారు. మళ్ళీ 6 నెలల నుంచి ఒకటో తేదీన జీతాలు అందుకుంటున్నాం. మనకు చాలా బకాయిలు వున్నాయి.. నా చేతుల్లో ఏమి మంత్రదండం లేదు. నేను ప్రభుత్వంతో మాట్లాడి అన్ని సమస్యలు ఒక కొలిక్కి వచ్చే విధంగా చూస్తాను. మన సంఘం లో ప్రతి ఒక్కరూ సమిష్టిగా వుండి నాకు సహకారం అందిస్తారు అని భావిస్తున్నాను అని విద్యాసాగర్ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news