వీసీ సజ్జన్నార్‌కు క్షమాపణలు.. లోకల్ బాయ్ నాని మీద కేసు నమోదు

-

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ యూట్యూబర్, ఫిషన్ మ్యాన్ లోకల్ బాయ్ నానికి చేటు చేసింది. వైజాగ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలో నాని మీద సీరియస్ అయ్యారు.దీంతో నాని తను చేసిన తప్పును ఒప్పుకుని ఇకమీదట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయనని సజ్జాన్నార్‌కు సారీ కూడా చెప్పారు.

అయితే, సజ్జన్నార్ ట్వీట్‌ని సీరియస్‌గా తీసుకున్న విశాఖ సీపీ నాని మీద కేసు పెట్టాలని ఆదేశించారు. పదుల సంఖ్యలో సైబర్ క్రైంకు అతని మీద ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో విచారణ జరిపిన సైబర్ క్రైం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఆదివారం మేజిస్ట్రేట్ ఎదుట నాని హాజరుపరచనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మానుకోవాలని ఈ సందర్భంగా ఇన్ ఫ్లూయెన్సర్లను పోలీసులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news