తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ఖర్చు అయ్యే ఇతర పద్ధతులను పాటించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లను పిల్లర్లు లేకుండా నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పిల్లర్లతో కూడిన నిర్మాణంలో వ్యయం పెరిగి ఇళ్లను అసంపూర్తిగా ఆపేస్తారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పద్ధతిలో మండలానికి ఒకటి చొప్పున మోడల్ ఇళ్లను నిర్మించనుందట. ఇది ఇలా ఉండగా.. జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి 5000 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు చాలామంది లిస్టు… తయారు కూడా చేసింది.