Breaking : నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణ వాయిదా..

-

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులకు కీలక సమాచారం వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ ఇటీవల అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. అయితే.. నిజానికి ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజాగా దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది టీఎస్‌పీఎస్సీ. వెబ్‌సైట్‌లో నెలకొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్‌పీఎస్సీ అధికారులు. టెక్నికల్‌ ప్రాబ్లమ్‌తో అప్లికేషన్స్‌ తీసుకోవడం లేదని గుర్తించిన అధికారులు గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు అధికారులు. దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటామన్న దానిపై అధికారులు తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ మొరాయించడం ఇదే తొలిసారి కాదు. గతంలో గ్రూప్‌1 దరఖాస్తుల
స్వీకరణ సమయంలోనూ వెబ్‌సైట్‌ పనిచేయలేదు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సమస్యను పరిష్కరించారు. ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 113 అసిస్టెంట్‌ మోటార్ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా (ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు వాలిడ్‌ హెవీ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 2-39 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొంది టీఎస్‌పీఎస్సీ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version