Breaking: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

-

తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్-1 అభ్యర్థుల కోసం ఏపీపీఎస్సీ (APPSC) బిగ్ అలర్ట్ జారీ చేసింది. మేయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ఈ రోజు (గురువారం) రాత్రి విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మే 3న తెలుగు, మే 4న ఇంగ్లీష్, మే 5న జనరల్ ఎస్సే, మే 6న హిస్టరీ, మే 7న పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, మే 8న ఎకానమీ, డెవలప్‌మెంట్, మే 9న సైన్స్ & టెక్నాలజీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం వంటి ముఖ్యమైన నగరాలలో 13 సెంటర్లలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయబడినట్టు సమాచారం.

గ్రూప్-1 పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. ఏపీపీఎస్సీ ప్రకటన ప్రకారం అభ్యర్థులు ఉదయం 8:30 గంటల లోపు తమ సెంటర్‌లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలకు 1,48,881 మంది రిజిస్టర్ చేసుకున్నారు, ఇందులో 72.5% మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ ప్రిలిమ్స్ ఫలితాలు ఏప్రిల్ 12, 2024న విడుదలయ్యాయి. కొంతమంది అభ్యర్థులు మూల్యాంకనంపై పిటిషన్లు వేసినా, కోర్టు వాటిని డిస్మిస్ చేసింది. మేమైన్స్ పరీక్ష మొదట సెప్టెంబర్ 2024కు షెడ్యూల్ చేయబడినప్పటికీ, ఇప్పుడు మే 3వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news