ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖల్లో ఉద్యోగాల భర్తీ..

-

ఏపీ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లు అందుతున్నాయి…ఏపీ లోని పలు శాఖలలో ఉన్న ఖాళీలను పూర్తీ చేసే పనిలో పడ్డారు.. ఇప్పటికే పలు విభాగాల్లో ఉన్న ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది సర్కారు..మొన్నీ మధ్య ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది.. ఆ ఉద్యోగాల గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఏపీపీఎస్సీ జోరు పెంచింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన చేసింది..ఈ ఉద్యోగాలకు డిగ్రీ, అంతకు పైన చదివిన వాళ్ళు అర్హులు..

జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్‌ సెలక్షన్ కమిటీ నియామకాలు చేపట్టనున్నారు. దేవాదాయ శాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు.అభ్యర్థులు పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడంతో వడపోత కోసం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించాలని ఆలొచిస్తున్నారు..గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల సంఖ్య పెంచినట్లు సమాచారం..ఇదే కాదు మరి కొన్ని శాఖలలో కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు.ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వాళ్ళు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ ను పూర్తిగా చదివి అప్లై చేయాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version