ప్రపంచంలో 5 వింతైన ప్రదేశాలు.. అక్కడ గ్రావిటీ పనిచెయ్యదు..కిందపడే ఛాన్సే లేదు..!

-

చెట్టు నుంచి యాపిల్ కిందకు పడితే మ్యాటరేం లేదు..మనకు తెలుసు..గ్రావిటీ వల్ల కిందేపడుతుంది..కానీ అదే యాపిల్ పైన పెడితే..అంటే చెట్టు నుంచి కిందకు పడకుండా..ఆకాశంలోకి వెళ్తే..అసలు జరుగుతుందా..ఏ వస్తువైనా కిందకే కదా పడాలి.అదే కదా మనం చిన్నప్పడు చదువుకున్నాం…కానీ ఈ భూమ్మీద ఐదు వింత ప్లేసుల్లో గ్రావిటీ పవర్ లేదు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

సెయింట్ ఇగ్నాస్ మిస్టరీ స్పాట్ (Saint Ignace Mystery Spot, Michigan, USA)

1950లో జరిగిందీ ఘటన. అమెరికాలోని మిచిగాన్ లో సెయింట్ ఇగ్నాస్ ప్రాంతంలో… కొందరు సర్వేయర్లు ఓ విషయాన్ని గుర్తించారు. వారంతా సెయింట్ ఇగ్నాస్ కి రాగానే వారి దగ్గర ఉన్న పరికరాలన్నీ పనిచేయడం మానేశాయి. ఎందుకు? అని పరిశోధనలు చేశారు. వారికి తెలిసిందేంటంటే… అక్కడ 300 అడుగుల డయామీటర్ సర్కిల్ లో మాత్రమే ఇలా జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా ఉంటాయి. ఆ ఇద్దరూ వేర్వేరు సైజులో ఉన్నా… అక్కడి ఓ రాయి ఎక్కి… అటూ ఇటూ మారగానే ఇద్దరి సైజూ ఒకేలా ఉంటుందట. అంతేకాదు… అక్కడి గోడలపై వాలుగా నిల్చోవచ్చు… అయినా కింద పడరు. అక్కడికి చాలా మంది పర్యాటకులు వెళ్లి… ఇలాంటి ట్రయల్స్ వేసుకొని సప్రజై ఫీల్ అవుతారు.

మిస్టరీ స్పాట్, శాంతాక్రజ్, కాలిఫోర్నియా (Mystery Spot, Santa Cruz, California)

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని… శాంతాక్రజ్ అవతల ఉన్న ఓ అడవిలో… 150 అడుగుల వ్యాసార్థ ప్రదేశం ఉంది. అక్కడి ప్రజలు పక్కకు వంగగలరు. వంకరగా నడవగలరు. వాళ్లు ఓ కొండను వాలుగా ఎక్కుతున్నట్లు ఫీలవుతారు. చాలా మంది టూరిస్టులు ఆ ప్రదేశానికి తరచూ వెళ్తుంటారు.. ఎందుకంటే.. ఎన్నిసార్లు వెళ్లినా… వాళ్లకు ఆ మిస్టరీ ఏంటో అర్థం కాక థ్రిల్ అలాగే ఉంటోంది. ఇది ఆప్టికల్ ఇల్యూషన్ లా ఉన్నా… కారణం ఏంటన్నది నేటికి తెలియట్లేదు.

మాగ్నెటిక్ హిల్, లేహ్, లడక్, ఇండియా (Magnetic Hill, Leh Ladakh, India)

ఇండియాలోని లడక్ లోని లేహ్ లో… మాగ్నెటిక్ హిల్ ఉంది. అక్కడి లేహ్-కార్గిల్-బాల్టిక్ జాతీయ రహదారిపై.. మాగ్నెటిక్ హిల్ ఉన్నచోట.. ప్రత్యేక ప్రదేశం ఉంది. అక్కడ వాహనాల్ని ఆపితే… అవి పైకి వెళ్లిపోతాయి. కిందకు వెళ్లాల్సినవి పైకి ఎందుకు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇదేదో మ్యాజిక్ లాగా ఉంది అని కొందరు అంటుంటారు. టూరిస్టులు అక్కడికి వెళ్లి తమ కార్లను ఆపుతారు. ఆ తర్వాత ఆ కార్లు పైకి వెళ్లిపోవడాన్ని స్వయంగా చూశారు. చుట్టూ ఉన్న కొండల వల్ల కార్లు కిందకు వెళ్తున్నా… పైకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయన్నది కొందరి వాదన. ఈ మిస్టరీ తేలాలంటే… స్వయంగా వెళ్లి పరిశోధించుకోవడమే.

జలపాతం, ఫారో ఐలాండ్స్ (Waterfall, Faroe Islands)

ఎక్కడైనా జలపాతం దగ్గర నీరు పై నుంచి కిందకు జాలు వారుతుంది కదా… స్కాట్లాండ్, ఐస్ లాండ్ మధ్యన అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో ఉన్న జలపాతం దగ్గర మాత్రం రివర్సులో జరుగుతుంది. అక్కడ నీరు కిందకు కాకుండా పైకి పోతుంది. ఇక్కడ గాలి కింద నుంచి పైకి ఎక్కువ వీస్తుండటం వల్లే ఇలా అవుతోంది. జలపాతం నుంచి వచ్చే నీటిని గాలి పైకి పంపేస్తోంది.

హూవర్ డ్యామ్, నెవాడా, అమెరికా (Hoover Dam, Nevada, USA)

అమెరికా… నెవాడా రాష్ట్రంలో హూవర్ డ్యామ్ దగ్గర కూడా నీరు పైకే వెళ్తుంది..అయితే దీనికి కూడా పైన చెప్పినట్లే గాలి ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది.

మీకు వీలైతే వీటిలో ఏ ప్రదేశానికైనా వెళ్లండి..కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. అసలు గోడ మీద ఏటవాలుగా అసలు నుల్చోగలుగుతామా..పైన అయితే నుల్చోవచ్చు కానీ..అక్కడ ఏటవాలుగా నుల్చున్నా కిందపడరంట..ఎంతి క్రేజీగా ఉందసలు..మిస్టరీల అంతు చూడాలి అనుకునేవారికి ఇవి మంచి పజిల్ లాంటివే.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version