ఏప్రిల్ 1వ తేదీ ఫూల్స్ డే: చరిత్ర, ప్రాముఖ్యత, విశేషాలు..

-

సంవత్సరం మొత్తంలో ప్రతీ రోజుకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంది. మొత్తం 365రోజుల్లో అన్ని రోజులకి ఉండే ప్రాధాన్యం, ఆ రోజున జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్కృతుల ఆధారంగా వివిధ తేదీల్లో వివిధ సంబరాలు జరుగుతాయి. అలా ఒకానొక సంస్కృతి నుండి సాంప్రదాయంగా మారిన తేదీల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందినవి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ఏప్రిల్ 1వ తేదీ ఫూల్స్ డే కూడా ఒకటి.

ఏప్రిల్ 1వ తేదీ వచ్చిందంటే చాలు, ఒకరినొకరు ఫూల్స్ చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. అక్కడ ఏమీ లేకున్నా ఉందని నమ్మిస్తూ, వాళ్ళు నమ్మితే ఫూల్స్ డే అని గుర్తు చేస్తూ నువ్వు ఫూల్ అయ్యావని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఇలా ఫూల్స్ చేసే రోజు ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. మొదటగా ఈ ఫూల్స్ డే యూరప్ లో జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మరి దీని వెనక గల కారణాలేంటో తెలుసుకుందాం.

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం పోప్ గ్రెగొరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఈ రోజు జరుపుకోవడం ప్రారంభమైంది. 1952 నుండి కొత్త సంవత్సరం జనవరి నుండి ప్రారంభమైన సమయంలో, అంతకుముందు కొత్త సంవత్సరం ఏప్రిల్ నుండి మొదలయ్యేదట. జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగరీ క్యాలెండర్ కి మార్చారో అప్పటి నుండి జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో చాలా మంది కొత్త క్యాలెండర్ ని వాడడం మొదలెట్టారు. మొదటగా ఫ్రాన్స్ దేశం ఈ పద్దతిని అనుసరించింది. ఆ తర్వాత ఎవరైతే ఇంకా పాత క్యాలెండర్ ని అనుసరిస్తున్నారో వారిని ఫూల్స్ అంటూ ఆటపట్టించింది. అలా అలా అది ఫూల్స్ డే గా రూపాంతరం చెంది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version