బిగ్‌బాస్ షోలో RGV ”థ్రిల్ల‌ర్” బ్యూటీ..?

-

క‌రోనా వ‌ల్ల ఈ ఏడాది ఇప్ప‌టికే ప్రారంభం కావ‌ల్సిన బిగ్‌బాస్ షో ఆల‌స్యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టి వ‌ర‌కు అస‌లు షో జ‌రుగుతుందా, కంటెస్టెంట్లు ముందుకు వ‌స్తారా ? అని అనుమానాలు ఉండేవి. కానీ వాటిని పటా పంచ‌లు చేస్తూ స్టార్ మా షోను నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. అందుకు గాను ఓ టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేసింది. ఇక ఈ సారి సీజ‌న్ 4కు కూడా నాగార్జున‌యే హోస్ట్‌గా రాబోతున్నార‌ని స‌మాచారం. అయితే ఈ సారి షోలో ఆర్‌జీవీ ”థ్రిల్ల‌ర్” మూవీ బ్యూటీ అప్స‌రా రాణి పాల్గొంటున్న‌ట్లు తెలుస్తోంది.

రామ్ గోపాల్ వ‌ర్మ త‌న థ్రిల్ల‌ర్ మూవీకి గాను అప్స‌ర రాణి ఫొటోల‌ను రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ బ్యూటీ తెగ పాపుల‌ర్ అయింది. సోష‌ల్ మీడియాలో ఈమెకు ఫాలోవ‌ర్లు కూడా విప‌రీతంగా పెరిగిపోయారు. ఆర్‌జీవీ తీస్తున్న థ్రిల్ల‌ర్ మూవీ విడుద‌ల కాక‌ముందే ఈ భామ చాలా పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఈమె బిగ్‌బాస్ షోలో పాల్గొంటే షో మ‌జాగా సాగుతుంద‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నార‌ట‌. అందుక‌నే వారు తాజాగా ఈ బ్యూటీని షో విష‌య‌మై సంప్ర‌దించార‌ని, ఈమెకు భారీ మొత్తంలో ముట్టజెబుతామ‌ని కూడా ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. కానీ ఈమె ఇంకా ఏ విష‌యం తేల్చ‌లేద‌ని తెలుస్తోంది.

అయితే అప్స‌ర రాణి బిగ్‌బాస్‌లో పాల్గొంటే షోకు అట్రాక్ష‌న్ వ‌స్తుంద‌ని కూడా ప్రేక్ష‌కులు అంటున్నారు. మరి ఈమె షో నిర్వాహ‌కుల ఆఫ‌ర్‌ను అంగీక‌రిస్తుందో, లేదో చూడాలి. ఇక ”న‌గ్నం” మూవీ న‌టి శ్రీ‌రాపాక‌ను కూడా బిగ్‌బాస్ టీం సంప్ర‌దించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఆమె భారీ మొత్తంలో అడ‌గ‌డంతో ఆమెకు బ‌దులుగా అప్స‌రా రాణిని తీసుకుందామ‌ని నిర్వాహ‌కులు అనుకున్నార‌ట‌. అయితే దీనిపై త్వ‌ర‌లో స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక షోలో ఇప్ప‌టికే మంగ్లి, స‌త్తి, లాస్య త‌దిత‌రులు పాల్గొంటున్నార‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఈ వార్త‌ల‌న్నింటిపై త్వ‌ర‌లో అస‌లు విష‌యాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version