గుజరాత్‌లో ఆప్‌దే విజయం.. తేల్చిన ఐబీ నివేదిక !

-

గుజరాత్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వచ్చేది ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఆ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక కూడా వెల్లడించిందని తెలిపారు. ఆప్ ఓట్లను చీల్చాలని బీజేపీ, కాంగ్రెస్ లు ఒక్కటయ్యాయని ఆరోపించారు.

‘ఐబీ నివేదికతో బీజేపీ కుంగిపోయింది. కాంగ్రెస్, బీజేపీలు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ నేతలు.. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి యత్నిస్తున్నారు. ఆప్‌ ఓట్లను కొల్లగొట్టే బాధ్యత కాంగ్రెస్‌కు అప్పగించారు’ అని రాజ్‌కోట్‌లో కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ 10 సీట్లకు మించి గెలవదని.. విజయం సాధించిన వారూ బీజేపీలో చేరతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌కు ఓటు వేయడం వృథా. బీజేపీ పాలనతో విసిగిపోయిన వారందరూ ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి. దిల్లీ, పంజాబ్‌ రికార్డులను బద్దలు కొట్టండి’ అని కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను అభ్యర్థించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version