మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3వ తేదీన మునుగోడు ఎన్నిక జరుగనుంది.
ఇక నవంబర్ ఆరో తేదీన ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు వెలువడనున్నాయి. ఇంతకు ముందు మునుగోడు ఎమ్మెల్యేగా.. పని చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో.. ఈ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా.. దేశ వ్యాప్తంగా.. మునుగోడు ఉప ఎన్నికతో పాటు.. మరో ఆరు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను జారీ చేసింది. కాగా.. ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వయి స్రవంతి ఫైనల్ కాగా.. బీజేపీ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండనున్నారు. అటు టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.