Archana Jois: RJ సూచనతో KGF చేశా..రాఖీభాయ్ తల్లి అర్చనా జాయ్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

KGF2 భారతీయ సినీ చరిత్రలో ఎవరూ ఊహించని విజయాలను సొంతం చేసుకుంటున్నది. కేజీఎఫ్ చాప్టర్ 1కు కొనసాగింపుగా వచ్చిన చాప్టర్ 2 ఈ నెల 14న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పిక్చర్ కు అఖండ ఆదరణ లభిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కేజీఎఫ్ చాప్టర్1,2..రెండిటిలోనూ తల్లి సెంటిమెంట్ ప్రధానమైనది. కాగా, ఆ తల్లి పాత్రను పోషించిన అర్చనా జాయ్స్ KGF జర్నీ గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ప్రశాంత్ నీల్ ఈ పాత్ర కోసం తనను సంప్రదించినపుడు యశ్ కు తల్లిగా అని చెప్పగానే తాను నో చెప్పానని అంది అర్చనా జాయ్స్. కానీ, సినిమా పాత్రకు తాను మాత్రం ముఖ్యమని భావించిన ప్రశాంత్ నీల్, ఆయన టీం సభ్యుల తన బేకరీ వద్దకు వచ్చి ఒప్పించే ప్రయత్నాలు చేశారని చెప్పుకొచ్చింది. తనకు ఇండస్ట్రీలో ఎవరూ గాడ్ ఫాదర్ లేరని, ఈ క్రమంలోనే తనకు స్నేహితుడు అయిన ఓ RJ వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించాడని తెలిపింది.

తాను ఇక ఆ RJ సూచన మేరకు KGF సినిమా ఒప్పుకున్నానని చెప్పింది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సక్సెస్ ను చూసి తాను చలా హ్యాపీగా ఫీలవుతున్నానని అంది. కేజీఎఫ్ కు ముందర తాను డ్యాన్సర్ అని తెలిపిన అర్చన.. తన తండ్రి కొంత కాలం పాటు ఆంధ్రాలోని పుంగనూరులో ఉన్నాడని గుర్తు చేసుకుంది.

తనకు తెలుగు భాష కొంత వచ్చని చెప్పింది. ఇకపోతే యాంకర్ కేజీఎఫ్ మూవీ యూనిట్ సభ్యులకు ఇన్సూరెన్స్ చేయించినట్లు వార్తలొస్తున్నాయని, అది నిజమేనా అని అర్చనను అడిగారు. ఆ ప్రశ్నకు అర్చన సమాధనం ఇచ్చారు.

తాను కూడా ఇన్సూరెన్స్ చేయించినట్లు విన్నానని, అది నిజమేనని అంది. KGF సెట్స్ లో పని చేసే జూనియర్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ అందరికీ ఇన్సూరెన్స్ చేయడం పట్ల దర్శకులు, నిర్మాత ఫోకస్ చేశారని చెప్పింది. ఈ విషయం తెలుసుకుని సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. కేజీఎఫ్ 2 చిత్రం ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగా రాస్తున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version