ఢిల్లీ పెద్ద‌ల ప‌నులు తెలంగాణ బీజేపీని ఇబ్బంది పెడుతున్నాయా..

-

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు బీజేపీ బాగా ఎదుగుతున్న పార్టీ అని చెప్పొచ్చు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ చెబుతున్న బీజేపీ ఆ మాట‌ను నిలుపుకునేందుకు బాగానే క‌ష్ట‌ప‌డుతోంది. బండి సంజ‌య్ నేతృత్వంలో తెలంగాణ‌లో క్ర‌మ‌క్ర‌మంగా పుంజుకుంటోద‌ని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక రావ‌డం బీజేపీకి క‌లిసి వ‌స్తోంది. ఈ ఉప ఎన్నిక అయ్యేలోగా మ‌రింత బ‌ల‌ప‌డేందుకు బండి సంజయ్ ప్ర‌జా సంగ్రామ యాత్ర ను ఎత్తుకున్నారు. ఇక త్వ‌ర‌లోనే విమోచ‌న దినం పేరిట భారీ బ‌హిరంగ స‌భ‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

BJP

ఇక సంజ‌య్ చేస్తున్న సంగ్రామ యాత్ర‌కు బాగానే పేరు వ‌స్తుంది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చ‌ర్చ సాగుతోంది. ఇక నేరుగా క‌మ‌ల‌నాథులు సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే వారు చేస్తున్న కృషి అంతా కూడా నీరుగారి పోతోంద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే కొంద‌రు బీజేపీ అగ్ర నేత‌లు కేసీఆర్‌కు ద‌గ్గ‌రగా మెల‌గ‌డం రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌ట్లేదు. మొన్న కేసీఆర్‌తో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీటింగ్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ఇంకోవైపు పలువురు కేంద్రమంత్రులు కూడా కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డంతో కేసీఆర్‌, బీజేపీ ఒక్క‌టైపోయాయంటూ పెద్ద ఎత్తున‌ కాంగ్రెస్ దీన్ని ప్ర‌చారం చేసింది. ఇది కాస్తా తెలంగాణ బీజేపీ నేతలకు మింగుడు ప‌డ‌ట్లేదు. తాము ఇంత చేస్తుంటే ఢిల్లీ పెద్ద‌లు మాత్రం ఇలా చేయ‌డం ఏంట‌ని అంతా విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా అయితే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య ఏకంగా కేసీఆర్‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో భేటీ కావ‌డం క‌లిసి లంచ్ చేయ‌డం అయితే క‌మ‌ల‌నాథుల‌ను పెద్ద ఇబ్బందులే పెట్టింది. త‌మ‌ను క‌ల‌వ‌కుండా ఇలా చేయ‌డ‌మేంట‌ని గుస్సా అవుతున్నారంట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version