గోళ్లు పెరిగి వాటంతట అవే విరిగిపోతున్నాయా..? అయితే ఈ సమస్యలే..!

-

మన గోళ్ళని బట్టి కూడా మన ఆరోగ్యాన్ని మనం చెప్పొచ్చు. ఒక్కొక్కరి గోర్లు ఒక్కోలా ఉంటాయి. పైగా గోర్లకి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కొంత మంది గోర్లు బలంగా ఎదుగుతూ ఉంటాయి. కానీ కొంత మంది గోర్లు బలహీనంగా ఉంటాయి.

 

పెళుసుగా కొంత మంది గోళ్లు ఉంటే.. కొంత మందిని పొట్టు లేచినట్లు ఉంటాయి. గోళ్ళ రంగు గోళ్ళ ఆకృతి బట్టి కూడా మనం ఆరోగ్య పరిస్థితిని చెప్పవచ్చు. మరి గోర్లు ఎలా ఉంటే ఎటువంటి సమస్యలు ఉన్నట్టు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

మీ గోళ్లు కనుక పసుపు రంగు లో ఉంటే ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు ఉన్నట్టు. కాబట్టి ఒకవేళ పసుపు రంగు లో గోళ్లు ఉంటే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.
ఒకవేళ కనుక గోర్లు నీలం రంగులో ఉంటే తగినంత మోతాదులో ఆక్సిజన్‌ లేనట్టే.
అలానే గోర్లు నీలం రంగు లో ఉంటే హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి జాగ్త్రత గా ఉండాలి.
తెల్లటి చారలు కనుక గోళ్ళ మీద ఉంటే కాలేయ సంబంధ వ్యాధులు ఉన్నట్టు.
ఒకవేళ కనుక గోర్లు కొద్దిగా పెరిగి వాటంతట అవే బ్రేక్ అవుతుంటే కాల్షియం లోపం ఉన్నట్టు.
గోర్లు పాలిపోయి ఉంటే రక్తహీనత సమస్య ఉన్నట్టు. కనుక ఇవి మీలో ఉంటే జాగ్రత్త పడండి. ఒకవేళ కనుక గోళ్లు బలహీనంగా ఉంటే బీ విటమిన్‌, కాల్షియం, ఐరన్‌ లోపం ఉన్నట్టు.
ఒత్తిడి ఎక్కువగా ఉంటే గోర్లపై పొట్టులాగ రాలిపోతుంది. చర్మం లోపలి నుండి ఇది అవుతుంది చూసుకోండి.
సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఆకుపచ్చ, నలుపు రంగులో ఉంటాయి గోళ్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version