చర్మంపై దురద, దద్దుర్లు ఉన్నాయా? ఒమిక్రాన్‌ లక్షణం కావొచ్చు..!

-

కరోనా కొత్త వేరియంట్ భయంతోనే కొత్తఏడాదిలో అడుగుపెట్టాం. ఇప్పటికే..భారత్ లో సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. కరోనా కంటే స్పీడ్ గా ఈ వైరస్ వ్యాపిస్తోంది. వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం తగ్గేదే లేదంటున్నాయి. ఒకటి రెండు కేసులతో మొదలై..ఇప్పుడ్లో వందల్లో ఉన్నాయి. ఇది వేలు అవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదని నిపుణులు అంటున్నారు. అయితే ఈ వేరియంట్ లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయని అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.ఒమిక్రాన్ లక్షణాలపై లండన్‌ కింగ్స్‌ కాలేజీ, హెల్త్‌ సైన్స్‌ కంపెనీ ZOE సంయుక్తంగా పరిశోధన నిర్వహించింది.

ఒమిక్రాన్‌ లక్షణాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఒమిక్రాన్ కొన్ని లక్షణాలను కొంతమేరకు..నిర్ధారించింది.. ఒమిక్రాన్ సోకిన వారిలో చర్మంపై అసాధారణ స్థాయిలో దద్దుర్లు, దురదలు వస్తుంటాయని కనుగొంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అది ఒమిక్రాన్ లక్షణం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.

ఒమిక్రాన్ సోకిందా లేదా తెలియాలంటే చర్మంలో మార్పులను గమనించాలని లండన్‌ కింగ్స్‌ కాలేజీ పరిశోధకులు తెలిపారు. 3.36 లక్షల మంది బాధితుల డేటాపై పరిశోధక బృందం అధ్యయనం చేసింది. కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు వస్తున్నట్టు గుర్తించారు.

కొవిడ్ పరీక్ష చేయించుకున్న 8.2 శాతం మందిలో కరోనా సాధారణ లక్షణాలు.. చర్మంపై దద్దుర్లు కనిపించాయి. సాధారణ ఇన్ఫెక్షన్ దద్దుర్లు లేదా ఒమిక్రాన్ లక్షణాలో చెక్ చేసేందుకు సైంటిస్టులు ఆన్‌లైన్ సర్వే చేశారు. కరోనా సోకిన 12 వేల మంది చర్మంపై ఇలాంటి దద్దుర్లు కనిపించాయి. 17 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు మొదటగా గుర్తించారు. ప్రతి ఐదుగురిలో ఒకరి చర్మంపై దద్దుర్లు వచ్చినట్లు తేలింది. ఇక దీన్నీ.. ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్లలో ఒక లక్షణంగా పరిశోధకులు గుర్తించారు. ZOE యాప్‌ నిర్వహించిన అధ్యయనంలో దాదాపు 2,500 కేసుల ఆధారంగా ప్రాథమిక డేటాను పరిశీలించగా.. డెల్టా కంటే Omicron మరింత తేలికపాటిదని తేలింది. కానీ, ఈ వేరియంట్ అత్యంత వేగంగా సోకుతుంది.

ఈ సీజన్లో ఇది కామన్ కదా..

సాధారణంగా శీతాకాలంతో.. చర్మంపై అనేక రకాల ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. మోచేతులు, మోకాలు, చేతులు, పాదాల వెనుక భాగంలో ఎక్కువగా ఉంటాయి. ఇతర దద్దుర్లు మురికి, వేడితో వస్తుంటాయి. మీ శరీరం అంతటా కనిపిస్తాయి. కొన్నిరోజులుకు అవే మానిపోతాయి. ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు ఆరోగ్యంబాలేని వాళ్లు.. ఇంట్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ జలుబు లక్షణాలు లేకుండా చూసుకోండి. జలుబు కూడా ఒక లక్షణమని ఈమధ్యనే కనుగొన్నారు. ఏమైనా లక్షణాలు ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే టెస్టు చేయించుకోవడం ఉత్తమని సూచిస్తున్నారు.
-triveni

Read more RELATED
Recommended to you

Exit mobile version