తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి… హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా సాగుతోంది. మెట్రో రైల్ విస్తరణ, ఫ్లైఓవర్ ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఇటీవల నిర్మించిన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగర అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.
అయితే తాజాగా హైదరాబాద్లోని పీవీ ఎక్స్ ప్రెస్ వే తర్వాత రెండో అతి పొడవైన ఫ్లైఓవర్ గా గుర్తింపు పొందిన షేక్ పేట వంతెనను మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు నిన్న న్యూ ఇయర్ సందర్భంగా ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
దీనికి సంబంధించిన నైట్ విజువల్స్ ను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వీటిని చూస్తుంటే సింగపూర్, దుబాయ్ లను తలదన్నేలా హైదరాబాద్ మహానగరం కనిపిస్తోంది. మూడు కిలోమీటర్ల పొడవున లైటింగ్ తో ఈ ఫ్లై ఓవర్… ఎంతో అందంగా కనిపిస్తోంది. కాగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 350 రూపాయల కోట్ల ను ఖర్చు చేసింది.
This one does look good with lights on 👇 pic.twitter.com/UNeJ0cVsY7
— KTR (@KTRTRS) January 1, 2022