నోటి పరిశుభ్రతకు, దంతాలు తెల్లగా మెరవడానికి, నోట్లో క్రిములు రాకుండా ఉండేందుకు, దంతాలు పుచ్చకుండా ఉండాలని టూత్ పేస్ట్‌లు వాడతారు. మరి జంతువులు ఏ పేస్ట్ వాడకుండానే బతుకుతాయి. వాటి పళ్లు తళతళా మెరిసిపోతాయి. వాటికి అసలు డెంటిస్ట్ అవసరమే ఉండదు. మన దేశంలో మూడు వంతుల మందికి పళ్లు పంచుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మరి ఆ పేస్ట్‌ల వల్ల లాభం మనం ఆశించినంతగా లేదు. లాభాలు లేవు కానీ.. పేస్ట్‌లో వాడే కెమికల్స్ వల్ల నష్టాలు అయితే ఉన్నాయి.
పేస్ట్‌ల్లో.. 20-40 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. లేదా జెల్ ఫామ్‌లో అయినా ఉంటాయి. 50 శాతం పేస్టుల్లో ఆబ్రసివ్ అంటే.. పాలిషింగ్ ఏజెంట్స్ కానీ, క్లీనింగ్ ఏజెంట్స్ ఉంటాయి. పేస్టుల్లో మెయిన్‌గా వాడే కెమికల్ కాంపౌండ్స్.. వాటి వల్ల కలిగే నష్టాలు చూద్దామా..!
పేస్ట్‌ల్లో ఉండే కెమికల్స్..
Aluminium Hydroxide – ఇది ఎక్కువ మోతాదులో వాడితే దంతాల పైన ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. పొట్టలో నొప్పులు రావడానికి కూడా ఇది కారణం అవుతుంది. బ్లడ్‌లో ఉండే ఫాస్పేట్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. మూడ్ స్వింగ్స్ అవడానికి కూడా కారణం అవుతుంది. బోన్స్ వీక్ అవుతాయి. మలబద్ధానికి కూడా కారణం అవుతుంది.
Hydrogen Phosphate- దీని వల్ల బ్లడ్‌లో లో కాల్షియం లెవల్స్ వస్తాయి. దీని వల్ల కూడా ఎముకలు బలహీనంగా అవుతాయి. ఈ పేస్టుల్లో ఆర్టిఫీషయల్ స్వీట్‌నర్స్ కలుపుతారు. కార్న్ సిరప్ ఎక్కువగా కలుపుతారు. ఇది ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. దీని వల్ల దంతాలు పుచ్చుతాయి.
Titanium Dioxide- దీని వల్ల లంగ్ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. నర్వ్ సిగ్నల్స్‌ను ఇంబాలెన్స్ చేయడానికి ప్రధాన కారణం ఇది.
Sodium Fluoride- దీని వల్ల ఎముకలు గుల్లబారిపోతాయి. వికారం, వాంతులు, సరిగ్గా అరగకపోవడం. కడుపు నొప్పి ఇలాంటివి అన్నీ దీని వల్ల వచ్చే నష్టాలు
PVM/MA Copolymer- ఈ కెమికల్ కాంపౌండ్ కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి బ్రస్ట్ క్యాన్సర్ వరకూ దారితీస్తుంది.
Sodium Lauryl Sulfate- దీని వల్ల హార్మోన్స్‌ను ఇంబాలెన్స్ చేస్తుంది. నరాల కణాజాలానికి టాక్సిక్‌గా ఉపయోగపడుతుంది.
ఇవి ప్రధానంగా హాని కలిగించే కెమికల్స్.. పేస్ట్ తయారు చేసే కంపెనీలు.. వీటిని వాడతాయి కానీ.. హెచ్చతగ్గుల్లో ఉంటాయి. ఇవే కాకుండా.. కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటీస్, ఫోమింగ్ ఏజెంట్ ఇలాంటివి అనేకం కలుపుతారు.
ప్రత్యామ్నాయం ఏంటి..?
అప్పుడప్పుడు వేప పుల్ల పెట్టి తోముతూ ఉండండి.
ఉత్తరేణి పుల్ల, గానుగు పుల్లతో కూడా అప్పుడప్పుడు బ్రష్ చేయండి
కరక్కాయ పొడితో అవకాశం ఉన్నప్పుడల్లా బ్రష్ చేయండి.
వీటన్నింటి కంటే.. తేనెతో బ్రష్ చేసుకుంటో.. క్రిములు భలే చచ్చిపోతాయి. నైట్ టైమ్ తేనెతో బ్రష్ చేసి పడుకుంటే. బాడ్ బాక్టీరియాలు పెరగవు.
పేస్టులు కూడా ఆయుర్వేదిక్ ఔషదాలతో తయారు చేసినవి అయితే ఇంత డామేజ్ ఉండదు.
ఇలా చేస్తుంటే.. దంతాలు పుచ్చకుండా, దుర్వాస రాకుండా ఉంటాయి. పేస్టుల వల్ల లాభాలు కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి.. ఇక నుంచి అయినా మార్పులు చేసుకోవాలంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.!
-Triveni Buskarowthu