పచ్చిమామిడికాయను తింటున్నారా..? అయితే కాలేయ సమస్యలు

-

వేసివి వచ్చిదంటే.. మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ఇక వీటిని తినేటైప్ లో భలే వెరైటీలు ఉంటాయి. కొందరికి రసం కాయలంటే ఇష్టం.. మరికొందరికి పచ్చిమామిడి కాయలంటేనే ఇష్టం. ఉప్పుకారం వేసుకుని మామిడికాయలు తింటారు. పండు మామిడికాయలతో జ్యూస్ చేసుకుని తాగడం అంటే మరికొందరికి ఇష్టం ఉంటుంది. ఎలా తిన్నా మామిడిపండ్లు ఆరోగ్యానికి మంచివే.. అయితే పచ్చి మామిడికాయలు తినడం వల్ల.. ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయటRaw
ango

పచ్చిమామిడికాయల వల్ల ఉపయోగాలు..

పచ్చి మామిడిలో విటమిన్ ఎ, బి6, సీ, కే వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వేసవిలో త్వరగా డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. వడదెబ్బ తగలకుండా చూస్తుంది. వేసవి కాలంలో జీర్ణసమస్యల నుండి ఉపశమనం పొందాలన్న, జీర్ణాశయం బలోపేతం కావాలన్న పచ్చి మామిడి ముక్కలను తీసుకోవటం మంచిదట.
పచ్చి మామిడిపండ్లలో ఉండే పోషకాలు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయపడతాయి.
చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.
రోగ నిరోధక శక్తిని పెంచే గుణం వీటిలో ఉంది. వీటిలో ఉండే అధిక ఫైబర్ వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా మామిడికి ఉంది. అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి.. ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అయితే కడుపు నొప్పి ఉన్న వారు పచ్చి మామిడి పండును తినకపోవటమే మంచిది. అతిగా పచ్చి మామిడి పండ్లను తింటే వాంతులు, దురుద, గొంతునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రయోజనాలు…

మామిడిపండ్లు ముఖ్యంగా మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయట. ఈ హెల్తీ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల పురుషుల్లో హెల్తీ స్ఫెర్మ్ ఉత్పత్తి అవుతుంది. స్పెర్మ్ క్వాలిటీ మెరుగుపడుతుంది. విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల ఇది లైకింగక సామర్థ్యంను పెంచుతుంది. ఈ పండులో ఉండే న్యూట్రీషియన్స్ వ్యక్తిలో వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version