వంటిట్లో..ఉప్పు, పప్పులతో పాటు..మెంతులు కూడా కామన్‌గా ఉంటాయి.. కానీ వాడకమే తక్కువగా ఉంటుంది. అసలు మీరు మెంతులతో ఏం చేస్తారు అంటే..చాలా మంది గృహిణులు టిఫెన్ పిండి గ్రైండ్ చేసేప్పుడు, పచ్చళ్లలో వాడతాం అంటారు.. కొందరు అది కూడా చేయరు.. కానీ మెంతులతో మీకు తెలియని ఉపయోగాలు చాలా ఉన్నాయి.. వీటి వల్ల వచ్చే లాభాలు తెలిస్తే.. ఎక్కడో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెంతుల స్థాయిని టాప్‌లో పెట్టేస్తారు..! మెంతులతో తయారు చేసుకునే నీటిని తాగడం వల్ల మనకు పలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మెంతుల నీళ్ల వల్ల ఉపయోగాలు..
ఒక పాత్రలో 2 గ్లాసుల నీటిని తీసుకుని అందులో 1 టీస్పూన్ మెంతులను వేసి బాగా మరిగించాలి. మెంతుల రంగు పూర్తిగా మారి నీరు ఆ రంగులోకి వచ్చాక ఆ మిశ్రమాన్ని సేకరించి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది.
మెంతులతో తయారు చేసుకునే ఆ నీటిని తాగడం వల్ల.. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఇలా తాగితే ఇంకా మంచిది..
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మెంతులు దివ్య ఔషధం అనే చెప్పాలి.. కనుక వారు ఈ నీటిని తాగితే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంటాయి..
గుండె, ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలన్నా.. ఆయా వ్యాధులు ఉన్నవారు వాటి నుంచి బయట పడాలన్నా.. మెంతుల నీటిని వారంలో కనీసం 3 నుంచి 4 సార్లు అయినా తాగాలి.
మెంతులను రాత్రి నానపెట్టి.. ఉదయాన్నే ఆ వాటర్ తాగేసి మెంతులు తినొచ్చు.. లేకుంటే ఆ నానిన మెంతులను అలానే వదేలసినా.. సాయంత్రానికి మొలకలు వస్తాయి. అవి ఇంకా రుచిగా ఉంటాయి.. అస్సలు చేదు అనిపించవు.. అలా అయినా ఆ మెలకలను తినొచ్చు.. మెంతులను డైలీ రొటీన్‌లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది..
మెంతులు జుట్టుకు ఎదుగుదలకు కూడా బాగా హెల్ప్ చేస్తాయి.. వారానికి ఒకసారి మెంతుల పేస్ట్‌ను తలకు పెట్టుకుని గంటపాటు ఉంచుకోని స్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య పోతుంది. చుండ్రు ఉండదు.. ఇంకా వెంట్రుకలు బలంగా ఉంటాయి.
ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి.. మీరు కూడా మీ అవసరాలకు తగ్గట్టు మెంతులను వాడేయండి..!