కాలిఫ్లవర్ తో మనం చాలా రకాల రెసిపీస్ ను తయారు చేసుకోవచ్చు. గోబీ మంచూరియా కాలిఫ్లవర్ ఫ్రై కర్రీ ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది కాలిఫ్లవర్ ని ఇష్టపడుతారు కూడా. అయితే నిజానికి కాలీఫ్లవర్ ను అధికంగా తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి మరి కాలీఫ్లవర్ ను అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి..?, ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకుందాం.
అధికంగా కాలిఫ్లవర్ ను తీసుకోవడం వల్ల పలు రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే నిజానికి కాలిఫ్లవర్ లాంటివి ఎక్కువకాలం డైట్ లో తీసుకోవడం చాలా ముఖ్యం. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ డైట్ లో తీసుకుంటే చాలా మంచిది కాలీఫ్లవర్ లో అద్భుతమైన పోషక పదార్థాలు ఉంటాయి. విటమిన్ సి వంటివి కూడా ఉంటాయి.
ఆకలిని తగ్గిస్తుంది: కాలిఫ్లవర్ ను తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు కడుపు నిండుగా అనిపిస్తుంది కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు దీన్ని తీసుకోవచ్చు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అనారోగ్య సమస్యల బారిన పడకుండా చూస్తుంది.
కాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు:
అధికంగా కాలిఫ్లవర్ ను తీసుకోవడం వల్ల బ్లడ్ థినింగ్ (blood thinning) మెడికేషన్ పై ప్రభావం చూపిస్తుంది ఇందులో విటమిన్ కే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రభావం చూపిస్తుంది అధికంగా విటమిన్ సి ఉండటం వల్ల బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు తగ్గిస్తే మంచిది.
గ్యాస్ సమస్య వస్తుంది:
కాలిఫ్లవర్ ను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య కూడా వస్తుంది ఈ సమస్యలు వస్తాయి కనుక అధికంగా తీసుకోకండి.