స్వీట్స్ ఎక్కువగా తింటున్నారా?.. అయితే మీకో షాకింగ్‌ న్యూస్..

-

పాత కాలంలో వందేళ్ళకు పైగానే బ్రతికే వాళ్ళు..ఆ రోజుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనుషులు ఎటువంటి రోగాలు లేకుండా ఉండేవారు.కానీ ఇప్పుడు మనిషి ఎప్పుడూ పోతాడో తెలియదు..అందుకే మనకున్న చిన్న జీవితంలో ఆరోగ్యంగా బ్రతకాలంటే, తన జీవనశైలిలో ఇష్టం ఉన్నా లేకున్నా పెద్ద మార్పులను చేసుకోవడం తప్పనిసరి.

 

బి.పీ, మధుమేహం మాత్రమే కాకుండ ఇపుడు చెక్కర వినియోగం వలన కాన్సర్ వస్తుందని పరిశోధకులు తేల్చారు. వినడానికి భాదగా ఉన్న ఇక నుండి స్వీట్లు తినడం తగ్గించినా లేదా పూర్తిగా తినకున్న పర్వాలేదు. చెక్కర కాన్సర్ కణాలను ఉత్పత్తి చేస్తున్నట్లు కనుగొన్నారు.రోజులో కనీసం ఒకసారైనా తెలిసి, తెలియకో చక్కెర పదార్థాలను తీసుకుంటున్నాము.. చక్కెర అధికంగా తీసుకుంటే మధుమేహం వస్తుందన్న విషయం తెలిసిందే.

మధుమేహం నుండి క్యా న్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఊబకాయానికి దారితీయవచ్చు. ఒక పరిశోధన ప్రకారం, ఒక గ్లాసు నిమ్మరసంలో 1-2 స్పూన్ల చెక్కర , ఒక గిన్నె నిండా రుచికరమైన క్యారెట్ హల్వా లేదా రైస్ కీర్ లో 3-4 చెంచాల పంచదార మరియు మీకు ఇష్టమైన గులాబ్ జామూన్లలో 4 చెంచాల పంచదార ఉంటుందని నిర్ధారించారు. స్వీట్ పదార్థాలను మన డైట్ నుండి తీసి వేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

మధుమేహ వ్యాధి కి చెక్కర వాడకానికి దగ్గర సంబంధం ఉంటుంది. దీని కారణంగా ప్రమాధకరమైన ఇతర అనారోగ్య సమస్యలకు వచ్చే అవకాశం ఉంది.ఇకపోతే సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్ తీసుకోవడం వల్ల పిల్లలలో, పెద్దవారిలో ఊబకాయానికి దారితీస్తుంది . పిల్లలలో షుగర్ బెల్లీ వద్ద జమ చేరి, వైసిరల్ ఫ్యాట్ సెల్స్ గా ఏర్పడుతాయి.ఎక్కువ పంచదార తినడం వలన కణాల గ్రహణ శీలత ప్రభావం కారణంగా బిటా కెటనిన్ క్యాన్సర్ కణాలు ఏర్పడవచ్చని నిపుణులు అంటున్నారు.. ఇన్ని సమస్యలను కలిగిస్తున్న చక్కెరను తినడం తగ్గిస్తే లేదా పూర్తిగా మానేయండి.. ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version