వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. కోహ్లీ, పంత్ అవుట్

-

నేడు ఇంగ్లండ్‌- భారత్‌ ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా.. భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (1) తాను ఎదుర్కొన్న మూడో బంతికే ఔటయ్యాడు. ఇంగ్లండ్ అరంగేట్ర ఆటగాడు గ్లీసన్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికే కోహ్లీ వెనుదిరిగాడు. గ్లీసన్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన కోహ్లీ.. డీప్ మిడ్ వికెట్ మీదుగా బాదేందుకు ప్రయత్నించి.. ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా వెళ్లడంతో.. బంతిని డేవిడ్ మలన్ అందుకున్నాడు. దీంతో కోహ్లీ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.

ఆ వెంటనే రిషభ్ పంత్ (26) కూడా పెవిలియన్ బాట పట్టాడు. గ్లీసన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించిన పంత్ విఫలమవడంతో ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ బట్లర్ క్యాచ్ పట్టేయడంతో భారత జట్టు 61/3 స్కోరుతో కష్టాల్లో పడింది. అయితే అంతకుముందు.. భారత సారధి రోహిత్ శర్మ (31) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ తన తొలి ఓవర్లోనే రోహిత్‌ను పెవిలియన్ చేర్చాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version