ఇండియా వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ప్రకారం, ఇది ఉత్తర భారతదేశంలో ఇప్పుడు చాలా చల్లగా ఉంటుంది. ఈ నేపధ్యంలో అక్కడ అధికారులు ప్రజలకు కొన్ని హెచ్చరికలు చేసారు. ఆల్కాహాల్ అలవాటు ఉన్న వారు ఈ నూతన ఏడాది పార్టీలకు తాగకుండా ఉండటం మంచిది అని హెచ్చరించారు. డిసెంబర్ 28 నుండి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తర రాజస్థాన్లలో “తీవ్రమైన” కోల్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
చలికాలం వచ్చే సాధారణ అనారోగ్యాలు మరింతగా వచ్చే అవకాశం ఉందని జలుబు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇది కరోనా వ్యాప్తికి మరింత కారణమవుతుంది అని అధికారులు హెచ్చరించారు. “ఆల్కహాల్ తాగవద్దు. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది” అని ఒక అధికారి పేర్కొన్నారు. తీవ్రమైన జలుబు ప్రభావాలను ఎదుర్కోవటానికి విటమిన్-సి అధికంగా ఉండే పండ్లను తినండని సూచించారు.
హిమాలయాలలో వాతావరణం మరింత చల్లగా ఉందని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లలో మంచు ఎక్కువగా కురుస్తుంది అని హెచ్చరించారు. హిమాలయాలు ఉత్తర భారతదేశంలో కనీస ఉష్ణోగ్రతను మూడు నుండి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.