ప్రైవేట్ కాలేజీలకు ఫి రీ అంబర్స్ మెంట్ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ మీద, ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించారు. మీ పిల్లలకు మాత్రమే ఫారెన్ చదువులా ? బడుగు, బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా జగన్ రెడ్డి గారు?ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసారు.ఎన్నికల ముందు కూతలు అధికారం వచ్చాకా కోతలు అంటూ సంచలన విమర్శలు చేశారు.
ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసింది వైకాపా ప్రభుత్వం. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం మంచిది కాదు జగన్ రెడ్డి గారు అని ఆయన విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీఓని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చెయ్యాలని కోరారు.