మీరు ఇంటెలిజెంటా? మీలో ఈ లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి.

-

ప్రతీ ఒక్కరికీ తాము ఇంటెలిజెంట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఐతే ఫీలింగ్ ఉండటం వేరు. నిజంగా ఇంటెలిజెంట్ అవడం వేరు. ఇంటెలిజెంట్ మనుషులు ఎలా ఉంటారు. వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల వారు ఇంటెలిజెంట్ గా కనబడతారో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంటెలిజెంట్ పీపులు ఎక్కువగా ప్రశ్నలు వేస్తుంటారు. మీరు జవాబులు చెబుతున్న కొద్దీ వారు అడుగుతూనే ఉంటారు.

మీరేవైనా పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారంటే, వాటికి అర్థం చెప్పమని అడుగుతారు. వాళ్లకి తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనీ, క్లారిటీగా అర్థం చేసుకోవాలని ఉంటుంది.

మీరు చెప్పిన విషయం బాగా ఆకర్షణగా ఉంటే నోట్ బుల్ రాసుకోవడమే, ఫోన్ లో సేవ్ చేసుకోవడమో చేస్తుంటారు.

వారెప్పుడూ నేర్చుకోవలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కొత్త కొత్త విషయాల పట్ల నేర్చుకోవాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అందుకే తెలియని విషయాలని చిన్నపిల్లలు అడిగినట్లుగా అడిగి మరీ తెలుసుకుంటారు. ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తేనే ఎక్కువ నేర్చుకోగలమని వారికి బాగా తెలుసు.

అలాగే తెలిసిన విషయాలు ఎక్కువ రోజులు గుర్తుంచుకోవడానికి నోట్ బుక్ లో రాసుకుంటారు. అలా చేయకపోతే కొద్ది రోజుల్లో మర్చిపోతామని వాళ్ళకి తెలుసు.

ఇంటెలిజెంట్ మనుషులు ఎప్పుడూ తమని తాము నిందించుకోరు. తప్పు చేసినా, చేసింది తప్పే అని ఒప్పుకుంటారు. అంతేకానీ, తమని తాము కొట్టుకుని, తిట్టుకుని బాధపడుతూ కూర్చోరు. ఈ ప్రపంచంలో మనుషులందరూ తప్పులు చేస్తారని వాళ్ళకు తెలుసు.

సాధారణంగా పుట్టుకతోనే ఎవరూ ఇంటెలిజెంట్ గా పుట్టరు. నేర్చుకునే తత్వం, ప్రశ్నించే విధానం అలవర్చుకుంటే మీరు కూడా ఇంటెలిజెంట్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version