చాల మంది కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతుంటారు. కోడి గుడ్లు ఫ్రిజ్ లో పెట్టరాదు. అదేంటి కోడి గుడ్లు పెట్టేందుకు ఫ్రిజ్ లో స్పెషల్ రాక్ కూడా ఉంది. ఎక్కువ రోజులు చెడిపోకుండా గుడ్లు ఫ్రెష్ గా ఉంటాయని వాదించకండి. గుడ్లను ఇలా ఫ్రిజ్ లో ఉంచితే వాటిలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి తిన్నప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. గుడ్లని ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం మనలో చాలామంది చేసే పని. కానీ, ఫ్రిజ్‌లో ఎగ్స్ స్టోర్ చేయడం ‘యమా డేంజర్’ అంటున్నారు నిపుణులు.
ఫ్రిజ్‌లో ఉన్న గుడ్లని బయటికి తీసినప్పుడు వాటి టెంపరేచర్ మారిపోయి పాడైపోతాయి. గుడ్ల పెంకులపై పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా ఏర్పడి అది గుడ్డు లోపలకి పోతుంది. అలాంటి గుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి. అందువల్ల గుడ్లని ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం మంచిది కాదు అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మరీ ముఖ్యంగా ఆరోగ్యం పేరుతో పిల్లలకు బ్యాక్టీరియా నిండిన గుడ్లు పెట్టొదంటున్నారు. మామూలు గది ఉష్ణోగ్రతలోనూ చాలా రోజుల పాటు గుడ్లు పాడవకుండా ఉంటాయి. కాబట్టి ఇకనుంచైనా ఫ్రిజ్‌లో గుడ్లు స్టోర్ చేయొద్దు.