యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపవుతున్నారా.?

-

ఈ మధ్యకాలంలో మనలో ఎక్కువ మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని లివర్ మరియు జీర్ణాశయం నుండి విడుదల అవుతుంది. శరీరం లో కావాల్సిన దానికంటే మించి ఉంటే కడుపులో గ్యాస్ ,కిడ్నీలో రాళ్లు, మూత్రపిండాల సమస్యలు , కీళ్ల,మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపు వంటి అనేక రకాల సమస్యలు అవహిస్తుంటాయి.

ఈ సమస్యలు గుర్తించినప్పుడు ముందుగా శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేయించుకోవాలి. దాన్నిబట్టి డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడుతూ ఉండాలి. దానికి తోడు ఆయుర్వేద చిట్కాలను కూడా ఫాలో అయితే చాలా తొందరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విడిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.

ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా విసర్జన సరిగ్గా జరగకపోతే మూత్రము రక్తంలోనే నిలిచిపోతుంది. అవి క్రమంగా స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కండరాల చుట్టూ పేరుకుపోతుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. రోజూ వాల్ నట్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని యూరిక్ స్పటికాలకు మంచి విరుగుడుగా పనిచేస్తుంది.

ఒకప్పుడు వాల్ నట్స్ ని చాలా తక్కువగా లభించేవి. కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా లభిస్తున్నాయి. వాల్‌నట్స్‌లో అనేక ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు ఉంటాయి, ఇవి శరీరానికి పోషణను అందించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. వాల్‌నట్‌లలో యాంటీ-ఆక్సిడెంట్లు మరియు పాలీఅన్‌శాచురేటెడ్,ఫ్యాటీ యాసిడ్‌ లు కూడా సమృద్దిగా ఉంటాయి.

ఇవన్నీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్పటికాల స్థాయిని తగ్గించటానికి సహాయపడతాయి. రోజుకి రెండు వాల్ నట్స్ ని కనీసం 5 గంటలు సేపు నీటిలో నానబెట్టి..ఆ తర్వాత దాని తొక్క తీసి డైరెక్టుగా కానీ, పాలలో కానీ కలిపి తీసుకోవచ్చు . ఈ విధంగా వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య క్రమంగా తగ్గిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version