ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఫోన్ ని ఎక్కువగా వాడుతున్నారు ఫోన్ వలన సులభంగా చాలా విషయాలను మనం తెలుసుకోవచ్చు. పైగా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో మనం చేతులో ఫోన్ పట్టుకుంటే చాలు పనులన్నీ యిట్టె అయిపోతున్నాయి అయితే చాలా మంది ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే దాకా ఫోన్ ని తెగ పడేస్తున్నారు. మీరు కూడా ఎక్కువగా ఫోన్ ఉపయోగిస్తూ ఉంటారా అయితే కచ్చితంగా ఈ సమస్యలు తప్పవు. మరి ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నది చూసేద్దాం.
చర్మం డ్రై అయిపోతుంది:
ఫోన్ ఎక్కువగా వాడటం వలన చేతులు మొఖం డ్రైగా అయిపోతాయి. చేతులు పై దురద కూడా వస్తుంది. రేడియేషన్ కారణంగా ఈ సమస్యలు వస్తాయి.
చర్మం ఎర్రగా మారుతుంది:
ఫోన్ ఎక్కువ ఉపయోగించడం వలన చర్మం ఎర్రగా మారుతుంది దురద కూడా వస్తుంది.
చర్మంపై ముడతలు:
ఫోన్ ని ఎక్కువగా ఉపయోగించడం వలన కళ్ల కింద ముడతలు వస్తాయి అలానే తక్కువ వెల్తురు లో ఫోన్ ని ఉపయోగిస్తే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.
డార్క్ స్పాట్స్ వస్తాయి:
ఫోన్ ఎక్కువ ఉపయోగించడం వలన మెలోనిన్ ఉత్పత్తి అవుతుంది దీంతో స్కిన్ టోన్ మారుతుంది. అలానే డార్క్ స్పాట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇతర సమస్యలు కూడా..
సాధారణ లైట్ తో కంటే బ్లూ లైట్ శరీరంలో సులభంగా చొచ్చుకుపోతుంది సో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది:
అలానే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వలన బ్రెయిన్ టెంపరేచర్ పెరిగిపోతుంది ఇది వివిధ రకాల క్యాన్సర్లకి దారితీస్తుంది. సో ఫోన్ ఎక్కువగా వాడకండి లిమిట్ గానే వాడండి కేవలం అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి అప్పుడు సమస్యలు ఉండవు.