లిక్కర్ స్కామ్ మూలాలు ప్రగతి భవన్ కేంద్రంగా బయటపడుతున్నాయి – జీవన్ రెడ్డి

-

బిఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తామని చెప్పి.. లిక్కర్ కేసును దేశవ్యాప్తం చేశారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అవినీతి సొమ్ము జీర్ణించుకోవడం సిసోడియాకి తెలియదన్నారు. మన వాళ్లకు అది అలవాటేనని విమర్శించారు. లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్లంతా ఎవరు అనేది చూడాలన్నారు. సౌత్ వింగ్ మూలాలు ఎక్కడ అనేది తేలాలన్నారు జీవన్ రెడ్డి.

గతంలో తెలుగు వాళ్లకు మంచి పేరు ఉండేదని.. ఇప్పుడు ఏ పేరుకు వచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు. లిక్కర్ కేసు మూలాలు తెలంగాణ లోనే ఉన్నాయన్నారు. సిసోడియా అరెస్ట్ తరవాత ఏం జరుగుతుందో బిఆర్ఎస్ వాళ్లకు తెలుసని.. అందుకే ఇక్కడి నాయకులు కండిస్తున్నారన్నారు. లిక్కర్ స్కామ్ మూలాలు ప్రగతి భవన్ కేంద్రం గా బయట పడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ మూలాలతో జరిగిన అవినీతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని.. ఇక్కడి పాలకుల ప్రోత్సహం లేకుండా జరిగిందా..? అంటూ ప్రశ్నించారు జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version