నేటి కాలంలో ఫాషన్ వరల్డ్ లో అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు అందంగా ఆకర్షణీయంగా ఉండాలని సర్జరీలు చేయించుకుంటున్నారు. కానీ ఇలా సర్జరీలు చేయించుకోవడం వలన ఎన్నినష్టాలు ఉన్నాయో తెలిసి కూడా కొందరు అదే పొరపాట్లు చేస్తున్నారు. కొన్ని సార్లు వీటి వలన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడ ఉంది. ఇప్పటికే చాలా మంది నటీ నటులు సర్జరీల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అర్జెంటీనాకు చెందిన మోడల్, నటి మరియు యాంకర్ అయిన సిల్వినా లూనా (43) తనకు ఉన్న అందాన్ని ఇంకా పెంచుకోవడానికి ఆశపడి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి నిర్ణయించుకుంది. ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్న తరుణంలోనే ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఈమె మరణానికి కారణం ప్లాస్టిక్ సర్జరీ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధి అని తెలుస్తోంది.