డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? మంత్రి హరీశ్ రావు

-

రాష్ట్రంలోని  కొంత మంది నాయ‌కులు డ‌బుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు.. అస‌లు డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. కొల్లూరులో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 

 కొంద‌రు డ‌బుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు. డ‌బుల్ ఇంజిన్ గ‌వ‌ర్న‌మెంట్ల‌లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టారా? క‌ల‌లోనైనా ఊహించారా? డ‌బుల్ ఇంజిన్‌లు అన్ని ట్ర‌బులే త‌ప్పా అక్క‌డ డ‌బుల్ బెడ్రూం ఇండ్లు లేవు. ఈ దేశంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ‌, మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, రూ. 70 ల‌క్ష‌ల విలువ చేసే ఇండ్ల‌ను మీ చేతుల్లో పెడుతున్నామని పేర్కొన్నారు. ఇవాళ ప్ర‌తిప‌క్షాలు అనేక ర‌కాల మాట‌లు చెబుతూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు య‌త్నిస్తున్నాయి.  గ‌త ప్ర‌భుత్వాల హయాంలో న‌ల్లా బిల్లు క‌ట్ట‌క‌పోతే తెల్లారేస‌రికి క‌నెక్ష‌న్ క‌ట్ చేసేవారు. ఇలా చెబుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నారు మంత్రి హరీశ్ రావు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version