యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సరసన అర్జున్ కూతురు !

-

యాక్షన్ కింగ్ అర్జున్.. హీరోగా, విలన్ గా సుపరిచితుడే. కానీ తనలో దర్శకుడు కూడా ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన మరోసారి మెగాఫోన్ పడుతున్నారు. ఈసారి తెలుగులో ఓ యువ హీరోతో సినిమా చేస్తుండడం విశేషం. విశ్వక్ సెన్ కోసం ఆయన ఓ కథ సిద్ధం చేశారని టాక్. ఆ కథలో నటించడానికి విశ్వక్ కూడా ఓకే అన్నాడట. త్వరలోనే ఈ సినిమా పట్టాలు పట్టాలెక్కబోతుంది.

విశేషమేమిటంటే ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించబోతోందని తెలుస్తోంది. మరోవైపు విశ్వక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఓకే అనిపించుకుంది. మరో సినిమా ‘దమ్కీ’ సెట్స్ పై ఉంది. ఇవి కాక ఇంకో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. అర్జున్ తో సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version