సాయుధపోరాటం అప్పుడు మీ బీజేపీ పార్టీ పుట్టిందా? – VH

-

సాయుధ పోరాటంలో మేము తప్ప ఎవరూ చేయలేనట్టు బిజెపి కొత్త డ్రామా ఆడుతుందని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. బిజెపి వాళ్ళు సాయుధ పోరాటంలో ఎక్కడా లేరని అన్నారు. సాయిధ పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఆర్య సమాజ్ లు మాత్రమే ఉన్నాయన్నారు. బిజెపి వాళ్లు ఎక్కడపడితే అక్కడ సర్దార్ పటేల్ బొమ్మలు పెడుతున్నారని మండిపడ్డారు. సర్దార్ పటేల్ ఎవరి ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్నాడు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్నారు. దానిని కూడా హైజాక్ చేస్తారా ? అంటూ దుయ్యబట్టారు.

వీ.హనుమంతరావు

నెహ్రూ ఆదేశిస్తే పటేల్ పోలీస్ చర్య చేపట్టారని అన్నారు. బిజెపి ఒక్క హామీనైనా నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. పాల మీద కూడా జీఎస్టీ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు, జీఎస్టీ పై ప్రజల దృష్టిని మళ్లించడానికి బిజెపి కొత్త డ్రామా ఆడుతోందని ఆరోపించారు. బిజెపి పార్టీలో ఎంతమంది అవినీతిపరులు ఉన్నారు? ఎంతమందిని జైలుకు పంపారు ? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version