కన్నతల్లికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆర్మీ జవాన్.. వీడియో వైరల్

-

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో అంశం వైరల్ అవుతూనే ఉంటుంది.అందులో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటే మరికొన్ని ఎమోషనల్ ఉంటాయి. మరికొన్ని పొలిటికల్ సెన్సెషనల్, ఇంకొన్ని క్రైమ్ రిలేటెడ్.. క్షణాల్లో మృత్యువు నుంచి తప్పించుకునే వీడియోలు.. క్షణాల్లోనే మృత్యువు కబలించిన ఘటనలు, ప్రపంచంలోని నలమూలలా జరిగే వింతలు, విశేషాలు అనేకం వెలుగుచూస్తుంటాయి.

తాజాగా సెలవులపై ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ కన్నతల్లికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముతున్న తన తల్లి వద్దకు మాస్కు, క్యాప్ ధరించి వెళ్లిన జవాన్.. ముందు కస్టమర్ లాగా మాట్లాడి ఆ తర్వాత మాస్క్, క్యాప్ తొలగించడంతో పాపం.. ఆ తల్లి ఎంతో ఎమోషనల్ అయ్యింది. చాలాకాలం తర్వాత కొడుకును చూడగానే కంట కన్నీరు ఆగలేదు. భావోద్వేగానికి గురవుతున్న తల్లిని కొడుకు అప్యాయంగా దగ్గరకు తీసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version