జవాన్‌పై దాడి చేసిన టోల్‌గేట్‌ను ధ్వంసం చేసిన స్థానికులు

-

ఉత్తరప్రదేశ్ మీరట్ లో నిన్న జవాన్ ను టోల్ గేట్ వద్ద విచక్షణారహితంగా టోల్గేట్ సిబ్బంది దాడి చేసిన సంగతి తెలిసిందే. సెలవులను ముగించుకొని ఢిల్లీకి తిరిగి వెళ్తున్న జవాన్ ఆలస్యం అవుతుందని ప్రశ్నించడంతో అతనిపై టోల్గేట్ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే జవాన్ ను కొట్టడాన్ని నిరసిస్తూ స్థానిక గ్రామాల ప్రజలు టోల్ ప్లాజా పైన దాడి చేశారు.

tollgate
Army Jawan Tied to Pole and Beaten by Toll Workers in Meerut

సిబ్బందిని కొట్టి అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేశారు. అంతకుముందు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన NHAI టోల్ ప్లాజా ఏజెన్సీ పై రూ. 20 లక్షల ఫైన్ విధించింది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ను ఉల్లంఘించినందుకు భవిష్యత్తులో వేలంలో పాల్గొనకుండా బ్యాన్ చేసింది. మరోవైపు ఇండియన్ ఆర్మీ కూడా జవాన్ పై దాడిని తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం రాజ్ పుత్ రెజిమెంట్ లో సైనికుడిగా ఆర్మీ జవాన్ కపిల్ కవాడ్ పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news