వర్షాకాలం వచ్చిందంటే చల్లని గాలి,పచ్చని ప్రకృతి తో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ సీజన్లో పాదాలు తడిగా మారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చర్మ సమస్యలు తలెత్తుతాయి. మీ పాదాలు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే ఈ సహజమైన చిట్కాలు తెలుసుకోవడం ముఖ్యం. పాదాలు వర్షాకాలంలో కాపాడే సులభ మార్గాలను ఇప్పుడు చూదాం..
పాదాల శుభ్రంగా ఆరబెట్టడం: వర్షంలో తడిసిన పాదాలను వెంటనే గోరువెచ్చ నీటితో కడగండి. సహజ సబ్బు లేదా వేప ఆకులు కలిపిన నీటిని ఉపయోగించండి. ఆ తర్వాత పాదాలను శుభ్రమైన టవల్ తో తుడిచి ఆరబెట్టండి. ముఖ్యంగా వేళ్ళ మధ్య భాగంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతం తడి లేకుండా చూసుకోండి.
వేపశక్తి : వేప ఆకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంటాయి. వేప ఆకులను మెత్తగా రుబ్బి పాదాలకు రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. వేప నీటిలో పాదాలను 15 నిమిషాలు ఉంచి శుభ్రంగా ఆరబెట్టండి.

కొబ్బరి నూనె మ్యాజిక్: రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాయండి ఇందులో లారీక్ యాసిడ్ ఉండి చర్మానితేమగా ఉంచి బ్యాక్టీరియాని నిరోధిస్తుంది. కొద్దిగా లవంగం నూనె, కొబ్బరి నూనెలో కలిపితే మరింత ప్రభావంతంగా ఉంటుంది. పాదాలకు సున్నితంగా మర్దన చేస్తే మంచి నిద్ర లభిస్తుంది.
సహజ స్క్రబ్ : పాదాల మీద చేరిన మురికిని తొలగించడానికి చెక్కెర, తేనె, నిమ్మరసం కలిపిన స్క్రబ్ ఉపయోగించండి. వారానికి రెండు సార్లు స్క్రబ్ చేయడం వల్ల చర్మం మృదువు గా ఆరోగ్యంగా ఉంటుంది.
సరైన ఫుట్ వేర్ : వర్షా కాలం లో తడి బూట్లు,తడి చెప్పులు ధరించడం మానండి. బదులుగా ఓపెన్ శాండిల్స్ వాడండి. మీకు అనుకూలం గా వుండే చెప్పులు ధరించండి. రోజు శుభ్రమైన పొడి సాక్స్ ధరించడం ముఖ్యం.
వర్షాకాలంలో పాదాల ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. వేప, కొబ్బరి నూనె సరైన శుభ్రతతో మీ పాదాలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ చిన్న అలవాట్లతో వర్షాన్ని ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా ఉండండి.