ఆదిలాబాద్‌లో ఫేక్ సర్టిఫికేట్లతో ఆర్మీ ఉద్యోగాలు తెరపైకి వచ్చాయి. ఫేక్ సర్టిఫికేట్లతో ఆర్మీ ఉద్యోగాలు పొందిన వారిని అరెస్ట్ కూడా చేశారు. ఫేక్ సర్టిఫికేట్లతో ఆర్మీలో ఉద్యోగాలు పొందారు ఆరుగురు యువకులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌లో యువకులు అరెస్ట్ అయ్యారు.

తెలంగాణ స్థానిక కోటాలో ఇండో టిబెట్ ఆర్మీలో ఉద్యోగాలు పొందారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరుగురు యువకులు. నకిలీ రెసిడెంట్ సర్టిఫికేట్లు, బోగస్ ఆధార్ కార్డులతో ఉద్యోగాలు పొందినట్లు గుర్తించారు పోలీసులు. ఈ తరుణంలోనే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌లో
యువకులు అరెస్ట్ అయ్యారు.