జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య కేసులో నిందితుడి అరెస్టు

-

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత అనుచరుడు మర్డర్ కావడం నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఈ కేసులో సంతోష్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు వాడిన కారుతో పాటు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం జిల్లాలోని ఓ పీఎస్‌లో నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. గంగారెడ్డిని అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు సంతోష్ ‌కాల్ డేటాను పరిశీలించారు. ఘటనకు ముందు నిందితుడు ఎవరెవరితో మాట్లాడారో అడిగి తెలుసుకున్నారు. గంగారెడ్డి హత్య కోసం కొద్ది రోజుల ముందు నుంచే నిందితుడు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, ఈ ఘటన జరిగాక స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇంటివద్ద పెద్దఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version