కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ జవాబు ఇచ్చారు. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా? విమర్శలకు నోటీసులే సమాధానమా? అంటూ ప్రశ్నించారు. అయితే నీకు నోటీసులు పంపుతా…కాచుకో అంటూ ఫైర్ అయ్యారు. నువ్వు సుద్దపూస అనుకుంటున్నవా? నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన అంటూ క్లారిటీ ఇచ్చారు. మాటకు మాట… నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరేనని… అందుకు బదులుగానే నేను మాట్లాడిన అంటూ వ్యాఖ్యానించారు. ఆయన సుద్దపూస అనుకుంటున్నాడేమో….ఆయన భాగోతం ప్రజలకు తెలుసు అన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు అంటూ మళ్లీ ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చినానని… లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం అన్నారు బండి సంజయ్.