అర్షదీప్ సింగ్ ని రూ. 18 కోట్లకు మళ్లీ దక్కించుకున్న పంజాబ్..!

-

ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 కొత్త సీజన్ కు ఇంకా చాలా రోజులే సమయం ఉంది. కానీ అంతకు ముందే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడేందుకు వచ్చేసింది ఐపీఎల్ మెగా వేలం. జెడ్డా వేదికగా ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కోట్లు వెదజల్లేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. భారత బౌలర్ అర్షదీప్ సింగ్ రూ.2కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ కోసం సీఎస్కే-ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి.

ఆ తరువాత గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చాయి. అంతిమంగా రాజస్థాన్ పై SRH పై చేయి సాధించి రూ.15.75 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం కార్డు ఉపయోగించింది. దీంతో సన్ రైజర్స్ రూ.18 కోట్లు చెల్లిస్తామని ముందుకు వచ్చింది. కానీ ఆ మొత్తాన్ని వెచ్చిస్తామని చెప్పడంతో అర్షదీప్ ను పంజాబ్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది. అంటే రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్నది పంజాబ్ కింగ్స్ టీం.

Read more RELATED
Recommended to you

Exit mobile version